శ్రీశైలం పాతాళగంగ పాత మెట్ల సమీప ఇంటి ఆవరణలోకి అర్ధరాత్రి వచ్చిన చిరుత పులి

సాక్షి డిజిటల్ న్యూస్:జనవరి3,నంద్యాల జిల్లా, శ్రీశైలం మండలం రిపోర్టర్ కోటి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలోని పాతాళగంగ వెళ్లే పాత మెట్ల మార్గంలోని సమీప ఇంటి ఆవరణలోకి గురువారం అర్ధరాత్రి ప్రవేశించి కలియతిరిగిన చిరుతపులి.దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పాతాళగంగ మెట్లవైపు సత్యనారాయణ అనే వ్యక్తి రేకుల షెడ్డుతో ఇల్లు నిర్మించుకున్నారు. అక్కడ చిరుతపులి సంచారం ఉండడంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. సత్యనారాయణ ఇంటికి చిరుత పులి రావడం ఇది రెండోసారి.కృష్ణానది తీరం,శివారు ప్రాంతం కావడంతో అక్కడ అప్పుడప్పుడు చిరుత పులి సంచారం ఉంటుందని స్థానికులు తెలియజేశారు.ఈ సందర్భంగా ఫారెస్ట్ అధికారులు అప్రమత్తంగా ఉండి తవు జాగ్రత్తలు తీసుకొవాలని భక్తుల, స్థానికుల భద్రకు సంబంధించింది కాబట్టి పులులను సమీపంలోకి రాకుండా చూడాలని స్థానికులు విన్నవించుకుంటున్నరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *