సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 03, ధర్పల్లి మండల్ రిపోర్టర్ సురేందర్ ధర్పల్లి మండల కేంద్రంలో విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు ఈరోజు బ్రహ్మంగారి గుడి ఆవరణలో ధర్పల్లి మండల సర్పంచ్ గా భారీ మెజార్టీతో గెలుపొందిన చెలిమెల శ్రీనివాసు ఉప సర్పంచ్ ఎజ్జ శ్రీకాంత్ ను శాలువా కప్పి మిఠాయి తినిపించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు అదేవిధంగా విశ్వబ్రాహ్మ కుల సభ్యునిగా వార్డు మెంబర్గా గెలుపొందిన గణపురం రాజును కుల సభ్యులు శాలువా కప్పి సన్మానించారు. రానున్న రోజుల్లో ఉన్నతమైన పదవులు సాధించాలని విశ్వబ్రాహ్మ కుల సభ్యులు అన్నారు ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ గా గెలుపొందిన చెలిమెల అజయ్, రెబ్బ శ్రావణ్ ను కూడా సన్మానించారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ కుల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
