వాకర్స్ 2026 క్యాలెండర్ ఆవిష్కరణ…..

★హాజరైన 304 డిస్టిక్ ప్రతినిధులు…

సాక్షి డిజిటల్ న్యూస్, జనవరి 03, సుల్తానాబాద్ మండల్ రిపోర్టర్ సంజయ్ : ఐటిఐ గ్రౌండ్ పెద్దపల్లి వాకర్స్
అసోసియేషన్ అధ్యక్షుడు కొట్టే లక్ష్మయ్య ఆధ్వర్యంలో 2026 వాకర్స్ క్యాలెండర్ ఆవిష్కరణ ఘనంగా నిర్వ హించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గా డిస్ట్రిక్ట్ 304 ప్రథమ గవర్నర్ అన్నమ నేని సుధాకర్ రావు,ఎలెక్ట్ గవ ర్నర్ గుడి పాటి వెంకటరమ ణారెడ్డి,గొట్టే ముక్కులరవీం దర్, క్యాబినెట్ సెక్రటరీ బుర్ర జగదీష్ గౌడ్ లు హాజరై, వాక ర్స్ తో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ అన్నెడి వెంకటరెడ్డి డిస్ట్రిక్ట్ కోఆ ర్డినేటర్, క్యాబినెట్ జాయింట్ సెక్రటరీ రాచకట్ల నరసిం హస్వామి, జోనల్ చైర్ పర్సన్ సయ్యద్, ప్రధాన కార్యదర్శి చింతపండు రాజమల్లు, ఉపాధ్యక్షుడు గుంటి కుమారస్వామి, సహాయ కార్యదర్శి కృష్ణారెడ్డి, కోశాధికారి చీటీ సతీష్ లతోపాటు జూనియర్ కాలేజీ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జక్కే శ్రీనివాస్ కలిసి ఉంటే కలదు సుఖం వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులైన తిర్రి తిరుపతి మూడు అసోసియేషన్ల సభ్యుల పాల్గొన్నారు. అలాగే నూతన మహిళా వాకర్స్ క్లబ్ ఐటిఐ గ్రౌండ్ ప్రతినిధుల ను గవర్నర్ సుధాకర్ రావు సన్మానించారు.వాకర్స్ ఇంటర్నేషనల్ ఫండ్ క్రింద 10వేల రూపాయల చొప్పున రాచకట్ల నరసింహస్వామి, సయ్యద్ అతీక్లు సేవాభావంతో వాకర్స్ ఇంటర్నేషనల్ కు అందజే శారు. తదుపరి కరీంనగర్లో జరిగే ఇంటర్నేషనల్ వాకర్స్ డిస్ట్రిక్ట్ 304 మొట్టమొదటి ఇ న్స్టాలేషన్ ప్రోగ్రాంకు అధిక సంఖ్యలో వాకర్ సభ్యులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.