రైతుల భూముల సమస్యల ప్రక్షాలనతో రైతులకు పాస్ బుక్కులు పంపిణీ.

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 2 తంబల్లపల్లి మండల రిపోర్టర్ ఇ. రమేష్ బాబు. తంబళ్లపల్లె మండలం లో రైతుల భూముల సమస్యల ప్రక్షాలనతో భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు లేని నూతన పట్టాదారు పాస్ బుక్కులు పంపిణీ చేస్తున్నట్లు తాసిల్దార్ శ్రీనివాసులు పేర్కొన్నారు. శుక్రవారం ప్రభుత్వ ఆదేశాల మేరకు కన్నె మడుగు సచివాలయంలో నూతన పాస్ బుక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రీ సర్వే లో పలు రకాల భూ సమస్యలు వచ్చాయని వాటిని దశలవారీగా పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో సైతం భూములకు సంబంధించి అన్నదమ్ములు, కుటుంబ సభ్యులు, పొలాల వద్ద వచ్చే సమస్యలు తమ దృష్టికి తెస్తే క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారుల సహకారంతో పరిష్కారం చేస్తానని హామీఇచ్చారు. నూతన పాస్ బుక్కులు ద్వారా రైతుకు రైతు భరోసా,రుణాలు, సబ్సిడీ పథకాలు తోబాటు అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షుడు సురేంద్ర,తెలుగు యువనేత రేపన బాబు, సోమశేఖర్,బాలరాజు, సిద్ధారెడ్డి,పురుషోత్తం, వీరాంజనేయులు, నరసింహులు,భూమిరెడ్డి,బిజెపి రామస్వామి రెడ్డి, భాస్కర్ రెడ్డి, వీఆర్వో వెంకటేష్, వీఆర్ఏలు నాగేశ్వర, మల్లి రైతులు పాల్గొన్నారు.