రీ-సర్వే ద్వారా భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం

★గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరి చేస్తున్న కూటమి ప్రభుత్వం ★ ఎమ్మెల్యే కె ఎస్ ఎన్ రాజు ★రావికమతంలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ ప్రారంభం

సాక్షి డిజిటల్ న్యూస్ రావికమతం : నియోజకవర్గంలో 25వేల మందికి… రాజముద్రతో కూడిన నూతన పాస్ పుస్తకాలను తొలి విడతగా పంపిణీ చేశామని చోడవరం ఎమ్మెల్యే కె ఎస్ ఎన్ రాజు అన్నారు. రీ సర్వే పూర్తయిన గ్రామాలకు సంబంధించిన రైతులకు ప్రభుత్వం కొత్తగా పాస్ పుస్తకాలను అందిస్తోంది. ఈ కార్యక్రమాన్ని రావికమతంలో శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చేతకాని పాలనతో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం సరి చేస్తోందన్నారు . రీ-సర్వే ద్వారా భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. గత ప్రభుత్వం తప్పులతో ముద్రించిన పాస్ పుస్తకాల స్థానంలో రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలను రైతులకు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తోందని, అందులో భాగంగానే రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. రీ-సర్వే ద్వారా భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, భవిష్యత్‌లో రైతులు బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాలు సులభంగా పొందేందుకు ఈ పాసు పుస్తకాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేస్తామని ఎమ్మెల్యే కె ఎస్ ఎన్ ఎస్ రాజు స్పష్టం చేశారు. గత పాలకులు వ్యవస్థలను ఎలా నాశనం చేశారో అందరికీ తెలుసన్నారు. ప్రజల ఆస్తులపై మహాత్మా గాంధీ మాదిరిగా జగన్ ఆయన ఫోటోలను ముద్రించుకొని, ప్రజాధనంతో పబ్లిసిటీ చేసుకున్నారని మండిపడ్డారఒక్క చోడవరం నియోజకవర్గంలోనే 25వేల పాసు పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని చెప్పారు. రైతాంగం ఆనందపడేలా మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఎమ్మెల్యే రాజు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ రాజాన కొండ నాయుడు ,సర్పంచ్ గంజి మోది నాయుడు, మండల పార్టీ అధ్యక్షులు శంకరరావు ,జనసేన మండల పార్టీ అధ్యక్షులు మైచర్ల నాయుడు ,ఎంపీటీసీ వేపాడ నాగేశ్వరరావు, గొంప ఎంపీటీసీ గంజి సూర్యనారాయణ,తట్టబంధ సర్పంచ్ గోకివాడ రమణ చేతుల మీదుగా కూడా పాస్ పుస్తకాలను ఎమ్మెల్యే సమక్షంలో రైతులకు అందించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ఎస్వి అంబేద్కర్, ఎంపీడీవో ఓ మహేష్, పలువురు రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు..శేషు రావికమతం.