యాసంగికి సరిపడా యూరియా అందుబాటులో కలదు

★రైతుల కు ఎలాంటి ఇబ్బంది రాదు. మండల వ్యవసాయ అధికారి ఏ డాకేశ్వర్ గౌడ్

సాక్షి డిజిటల్ న్యూస్, జిల్లా:వనపర్తి, మండలం:చిన్నంబావి, రిపోర్టర్:క్రాంతి కుమార్, యాసంగి పంటలకు సరిపడ యూరియా అందుబాటులో కలదు రైతులు ఎలాంటి ఇబ్బందులు గురికాకుండా మీయొక్క పట్టాదారు పాసు బుక్కు, ఆధార్ కార్డు తీసుకెళ్లి యూరియా బస్తాలు తీసుకోగలరు. యూరియా సరఫరా అనేది నిరంతరం ప్రక్రియ . యాసంగిలో సాగు చేసే పంటల విస్తీర్ణాన్ని బట్టి మండలానికి 1850 మెట్రిక్ టన్నులు ఇవ్వడం జరిగింది. కనుక రైతులు సింగిల్ విండో సొసైటీసు, ఆగ్రో సెంటర్స్ మరియు ప్రైవేట్ ఫర్టిలైజర్ షాప్ లో నుండి తీసుకొనగలరు. ఫర్టిలైజర్ డీలర్లు కృత్రిమ కొరత సృష్టిస్తే (FCO)ఆర్డర్ ప్రకారం చట్టం ప్రకారం చర్యలు తీసుకోబడును.