మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి: 03, వేములవాడ.ఆర్.సి.ఇంచార్జ్: సయ్యద్ షబ్బీర్… రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి అత్యధిక సీట్లు సాధించాలని వేములవాడ పట్టణ బీజేపీ అధ్యక్షులు రాపెల్లి శ్రీధర్ అన్నారు. ఈ సందర్భంగా స్థానిక పద్మశాలి సంఘంలో రాపెల్లి శ్రీధర్ అధ్యక్షతన నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అధ్యక్షులు రెడ్డిబోయిన గోపి మాట్లాడుతూ రాజన్న క్షేత్రం వేములవాడ మున్సిపల్ లో బీజేపీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా అందరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. సీనియర్ నాయకులు ప్రతాప రామకృష్ణ, కార్యకర్తలు అందరూ కలిసి కట్టుగా పనిచేసీ మున్సిపల్ జెండా ఎగరవేయడానికి దోహదపడాలని అన్నారు. చెన్నమనేని వికాస్ బాబు మాట్లాడుతూ ముందు కంటే బీజేపీ ఇప్పుడు బలంగా ఉందని, మన పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఎర్రం మహేష్, సిరికొండ శ్రీనివాస్, కృష్ణస్వామి, సoటి మహేష్, రేగుల రాజ్ కుమార్, రాధిక, వివేక్, రేగుల సంతోష్ బాబు, వెంకన్న, రేణికింది అశోక్, గడ్డమీద శ్రీను, పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.