సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 02, ధర్పల్లి మండల్ రిపోర్టర్ సురేందర్, ధర్పల్లి మండల కేంద్రంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన టిఆర్ఎస్ బలపరిచిన సర్పంచులు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం శాలువా కప్పి సన్మానించారు ఈ కార్యక్రమంలో ఓనాజీపేట్, సితాయిపేట్, దుబ్బాక, ఇంద్రానగర్ తాండ లో గులాబీ జెండా ఎగురవేసిన అభ్యర్థులను బాజిరెడ్డి గోవర్ధన్ అభినందించారు గ్రామాల అభివృద్ధికి కట్టుబడి పనిచేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ టిఆర్ఎస్ నాయకులు రాజ్ పాల్ రెడ్డి, హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు.