సాక్షి డిజిటల్ న్యూస్ మెదక్ జిల్లా తూప్రాన్ జనవరి 02 ప్రతినిధి మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలోని నర్సాపూర్ చౌరస్తా వద్ద పోలీసులు జనవరి 1 నుంచి 31 వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు రోడ్డు భద్రత గురించి అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా శుక్రవారం సాయంత్రం నర్సాపూర్ చౌరస్తా వద్ద వాహనదారులకు హెల్మెట్ ధరించాలని సూచించారు హెల్మెట్ ధరించిన వారికి శాలువతో సన్మానిం చారు లేని వారికి గులాబీ పువ్వులు చెవిలో పెట్టి ఇంకోసారి హెల్మెట్ లేకుండా రావద్దని కోరారు ప్రతి మనిషికి ఆరోగ్యంగా ఎంత సురక్షితమో వాన దారులకు రోడ్డుమీద వెళ్లేటప్పుడు హెల్మెట్ సీట్ బెల్టు ధరించడం అంతే ముఖ్యం అందుకనే ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని తమ ప్రాణాలు ఎవరి వారి రక్షణగా నిలబడాలని ప్రజలకు కోరారు ఈ కార్యక్రమంలో ఎస్సై టు జ్యోతి ఏ ఎస్ ఐ వాణి పోలీస్ సిబ్బంది కానిస్టేబుల్ తదితరులు పాల్గొన్నారు
