సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి.3, బి.కొత్తకోట రిపోర్టర్ చక్రపాణి జనవరి నెల 18వ తేదీన ఖమ్మం నగరంలో జరిగే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ శతవార్షికోత్సవాల ముగింపు సభకు గౌరవార్థంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం (బికేఎంయు)మరియు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ల ఆధ్వర్యంలో ఈనెల నాలుగవ తేదీ ఆదివారం,బి.కొత్తకోట మండలంలోని బీరంగి గ్రామం,టానామిట్ట వద్ద జరిగే భూ పోరాట జిల్లా సదస్సును జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి టి.కృష్ణప్ప,నియోజకవర్గపు కార్యదర్శి ఎస్.మనోహర్ రెడ్డి లు పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు బీరంగి గ్రామంలోని టానామిట్ట వద్ద సదస్సుకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ; పేదల సాగు మరియు నివాసంలో ఉన్న భూములకు పట్టాలు పంపిణీ చేయాలని,కోనేరు రంగారావు భూ కమిటీ సిఫార్సులు అమలుపై, అసైన్డ్ చట్ట సవరణపై ఈ యొక్క సదస్సులో చర్చించి పోరాట రూపకల్పన చేయడం జరుగు తుందని, ఈ యొక్క సదస్సుకు ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల. ఈశ్వరయ్య, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి.హరినాథ్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ. రామానాయుడు,వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు బి.కేశవరెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి పి.మహేష్ తదితర నాయకులు పాల్గొంటున్నారని భూ పోరాటాలే ప్రధాన అజెండాగా జరుగుతున్న ఈ యొక్క సదస్సుకు నియోజకవర్గంలోని వ్యవసాయ కార్మికులు,పార్టీ మరియు అనుబంధ సంఘాల కార్యకర్తలు అందరు కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి పి.నారాయణస్వామి, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి హరికుమార్, శంకర, లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు.