సాక్షి డిజిటల్ న్యూస్ 3-1-2026 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల రిపోర్టర్ అన్నవరపు నాగేంద్ర… వంట గ్యాస్ వినియోగదారులు గ్యాస్ పొందాలంటే ఇకపై ఈ-కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని, అలాగే బుకింగ్ అనంతరం ఓటీపీ తప్పనిసగా చెప్పాల్సి ఉంటుందని శ్రీ సాయి భారత్ గ్యాస్ వారు సూచించారు. మండల పరిధిలోని నల్లివారిగూడెం, అర్బన్ కాలనీ లో శుక్రవారం వంట గ్యాస్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా వంటగదిలో పాటించవలసిన జాగర్తలు వివరించారు. ప్రతి ఒక్కరు 5 సంవత్సరాలకు ఒకసారి భారత్ గ్యాస్ వారు సూచించన సురక్షా ట్యూబ్ లనే వాడాలని, పలు సూచనలు చేశారు. అనంతరం ఈ-కేవైసీ కూడా తప్పనిసరి మీ ఆధార్ కార్డు లింక్ చేసి, బయోమెట్రిక్ ధ్రువీకరణ చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా మీ డేటా సరైనదేనా అని చెక్ చేస్తారు. ఇంకా మీరు బయోమెట్రిక్ చేయకపోతే, త్వరలోనే ఆన్లైన్ బుకింగ్ బ్లాక్ అవుతుందని తెలియజేశారు. ఈ-కేవైసీ, బయోమెట్రిక్ పెండింగ్ లో ఉన్న వినియోగదారులు వెంటనే భారత్ గ్యాస్ ఆఫీస్ కు వెళ్లి ఈ-కేవైసీ చేయించుకోవాలని సూచించారు. గ్యాస్ సిలిండర్ బుకింగ్ సులభమైన విధానం… గ్యాస్ సిలిండర్ బుక్ చేయడం ఇప్పుడు చాలా సులభం. కంపెనీ కి సంబందించిన మిస్డ్ కాల్ నంబర్లు ఇలా ఉంటాయి. భారత్ గ్యాస్ వినియోగదారులు 7710955555 కు మిస్డ్ కాల్ ఇవ్వండి. బుక్ చేసిన వెంటనే మీ మొబైల్ ఫోన్ కు కన్మర్మేషన్ మెసేజ్ వస్తుంది, అందులో డెలివరీ కోడ్ వస్తుంది. గ్యాస్ డెలివరీ అయినా సమయంలో ఆ కోడ్ ను డెలివరీ బాయ్ షేర్ చేయాల్సి ఉంటుంది.
