సాక్షి డిజిటల్ న్యూస్ ,జనవరి 3, మంచిర్యాల జిల్లా తాండూరు మండలం లోని కిష్టంపేట గ్రామపంచాయతీ లో పంచాయతీ కార్యదర్శి ఉదయ్కు సర్పంచ్ సార్ల తిరుపతి కి కిష్టంపేటలోనీ బెల్ట్ షాపులు, స్క్రాప్ దుకాణాల తీరు ఇష్ట రాజ్యాంగ నడుస్తున్నాయని గ్రామ ప్రజలు బాధితులు అందరూ కలిసి వినతిపత్రం అందజేశారు. యువకులు కోందరు మద్యం మత్తులో రాత్రి వేళల్లో దొంగతనానికి అలవాటుపడి రాత్రివేళల్లో ఇళ్లల్లో చొరబడి దొంగతనాలు చేస్తున్నారని దొంగిలించిన వస్తువులన్నీ దగ్గర్లో ఉన్న స్క్రాప్ దుకాణాలకు అమ్ముకుంటు వాటితో వచ్చిన డబ్బులను మళ్లీ బెల్ట్ షాపుల దగ్గరికి వచ్చి మందు తాగుతున్నారని అధికారులు, ప్రజా ప్రతినిధులు దీనిపై తగు చర్యలు తీసుకోగలరని వాటిని కిష్టంపేట గ్రామపంచాయతీ నుండి ఎత్తివేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ధర్మరాజుల రమేష్, పాగిడి చిరంజీవి, ఏముర్ల ప్రదీప్, ఏముర్ల ప్రవీణ్, పసూల ప్రమీల, సూర్ల భాను, మేడి రాజమ్మ, మేడి రవికుమార్, శ్రావణ్, కామెర రమేష్, కామెర మహేష్, చల్లూరి ప్రసాద్, మేడి రవి, కస్తూరి భవాని, మేడి భవాని, సుజాత తదితరులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.