బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కచ్చితంగా అమలు చేయాలి, ఎమ్మెల్యే తలసాని

సాక్షి డిజిటల్ న్యూస్ - జనవరి 3- సనత్ నగర్ - రాష్ట్ర ప్రభుత్వం బిసి లకు 42 శాతం రిజర్వేషన్ ను అమలు చేసి చిత్తశుద్ధిని చాటుకోవాలని మాజీమంత్రి, అసెంబ్లీ లో డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను బిసి జేఏసి చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, ఇతర నాయకులు కలిసి 42 శాతం రిజర్వేషన్ ల అమలు కోసం ప్రభుత్వం పై వత్తిడి తీసుకురావాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఎన్నికల ముందు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా అమలుకు నోచుకోలేదని మండిపడ్డారు. అసెంబ్లీలో బిసి బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు తెలిపినప్పటికీ బిల్లుకు చట్టబద్దత కోసం కేంద్ర ప్రభుత్వం పై వత్తిడి తీసుకు రావడానికి రాష్ట్ర ప్రభుత్వం నేటి వరకు ఢిల్లీకి అఖిలపక్షం ను తీసుకెళ్లలేదని ధ్వజమెత్తారు. 42 శాతం రిజర్వేషన్ అమలు జరిగే వరకు ఎం పి టి సి, జెడ్ పిటి సి ఎన్నికలు నిర్వహించకుండా ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలలో ప్రభుత్వం పై తీవ్ర వత్తిడి తీసుకురావాలని వారు తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కోరారు. ఈ కార్యక్రమంలో బిసి నాయకులు గణేష్ చారి, విక్రమ్ గౌడ్, వీరస్వామి, శ్యామ్, శేఖర్, మణి తదితరులు ఉన్నారు.