సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 3, పాలకొండ నియోజకవర్గం ఇంచార్జ్, ( గంగాడ గౌరీ శంకర్ ) ఆర్టీసీ బస్సు డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణికును సురక్షితంగా గమ్యానికి చేర్చేందుకు తోడ్పడాలని పాలకొండ ఎస్ ఐ కే ప్రయోగమూర్తి అన్నారు. ఆయన శుక్రవారం నాడు ఏపీఎస్ఆర్టీసీ పాలకొండ బస్ డిపోలో జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం డిపో మేనేజరు బి.ఎస్.ఎన్ మూర్తి అధ్యక్షతన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆర్టీసీ డ్రైవర్లు సురక్షితమైనటువంటి డ్రైవింగ్, చేసే సమయంలో ఎదుట వాహనాలను, పాదచారులను గమనిస్తూ ఉండాలన్నారు. ముఖ్యంగా మద్యం సేవించి గాని,సెల్ఫోన్ లో మాట్లాడి డ్రైవింగ్ చేయడం కానీ, రాంగ్ రూట్లో నడపడం గాని, ఓవర్టేక్ చేయడం వంటివి మానుకోవాలని సూచించారు. వీటి వలన ఎన్నో అనర్ధాలు జరిగే జరుగుతాయని అన్నారు, అంతేకాకుండా ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందన్నారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం అని ప్రజల్లో ఓ నమ్మకాన్ని ఆర్టీసీ సిబ్బంది కలిగించాలని అన్నారు. ప్రయాణికుల పట్ల దురుసుగా ప్రవర్తించకూడదని, అన్నారు. అధికారులు ప్రభుత్వం నియమ నిబంధనలను, సూచనలు పాటించాలని, అన్నారు. ఈ కార్యక్రమంలో డిపో అసిస్టెంట్ మేనేజరు యు రమేష్, డిపో అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ ఎల్ రాము, డిపో హెక్లర్కు ఎంకేఏం నాయుడు, డిపో సెక్యూరిటీ హెడ్ గార్డ్ ఎం గోవిందరావు, ఎంప్లాయిస్ యూనియన్ జోనల్ సెక్రెటరీ బి కే మూర్తి, అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బదిలీపై వెళ్తున్న ఎస్సై కె ప్రయోగ మూర్తి యూనియన్ నాయకులు దుస్సాలువతో సత్కరించారు. బాసురు కృష్ణమూర్తి మెమొంటోను అందజేశారు. ఎం వి సాగర్, ఎం సుబ్బారావు, ఎల్ ఆర్ రావు, డీజే బాబు, ఏఎస్ నాయుడు లు,ఘనంగా, ఎస్ ఐ ను సత్కరించారు.