ప్రభుత్వం మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినీలతో ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్.

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 3 (పాలేరు రిపోర్టర్ పి వెంకన్న ) పాలేరు నియోజకవర్గం లోని తిరుమలాయ పాలెం మండల కేంద్రంలో ఖమ్మం ప్రభుత్వం మహిళా డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో స్పెషల్ క్యాంపు ఘనంగా నిర్వహించబడింది. ఖమ్మం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల యాజమాన్యం వారం రోజుల పాటు గ్రామాన్ని దత్తత తీసుకొని సేవా కార్యక్రమాలు చేపట్టింది. ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షులుగా భానోత్ రెడ్డి, ప్రిన్సిపల్ గవర్నమెంట్ మహిళా డిగ్రీ కళాశాల పాల్గొనగా, ఉపసభ అధ్యక్షులుగా విజయకుమారి హెచ్ఎం జడ్పీహెచ్ఎస్ తిరుమలాయపాలెం హాజరయ్యారు.ముఖ్యఅతిథిగా కాకతీయ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ సత్య నారాయణ పాల్గొని విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ క్యాంపు ప్రధాన ఉద్దేశం సమాజసేవద్వారా విద్యార్థుల్లో బాధ్యత, క్రమశిక్షణ, సేవా భావాన్ని, పెంపొందించడం అని తెలిపారు. ఈ క్యాంపు ద్వారా గ్రామంలో పారిశుధ్యం, ఆరోగ్యo అవగాహన, విద్యా సహాయం, పర్యావరణ పరిరక్షణ, సామాజిక చైతన్య, కార్యక్రమాలు చేపట్టి గ్రామాన్ని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని వివరించారు. ఈ స్పెషల్ క్యాంపు విద్యార్థినులకు అనుభవాత్మక విద్య గానిలవడమే కాక గ్రామ అభివృద్ధికి దోహదపడే కార్యక్రమంగా నిలుస్తుంది అని తెలిపినారు.ఖమ్మం మహిళ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఏడు రోజుల నిర్వహించే శ్రమదాన శిబిరం గ్రామంలోని చిన్న సమస్యలను గుర్తించి శ్రమదానం తో పరిష్కరించేందుకు ముందుకు వచ్చారు గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కళాశాల విద్యార్థులు చేస్తున్న సేవలకు తిరుమలాయపాలెం సర్పంచ్ ధరావత్ సుజాత నరసింహారావు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో చెత్త తొలగింపు, పరిసరాల శుభ్రత వంటి,,కార్యక్రమాల విద్యార్థులు పాల్గొన పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేశారు.ఈ శిబిరం మా పాఠశాల నుండి ప్రారంభం కావడం చాలా గర్వకారణంగా ఉందన్నారు.ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు శ్రమదానం మధ్యాహ్నం నాలుగు గంటల వరకు అవగాహన కార్యక్రమాలు సాయంత్రం 6:00 నుంచి సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహిస్తామని కళాశాల ప్రిన్సిపల్ తెలియజేశారు. ఎన్ఎస్ఎస్ క్యాంపు లక్ష్యం ఇదే… సేవతో చైతన్యం అవగాహనతో మార్పు.,…. ఎన్ఎస్ఎస్ ( నేషనల్ సర్వీస్ స్కీమ్ ) క్యాంప్ యొక్క అసలు ఉద్దేశం గ్రామీణ ప్రజల్లో సామాజిక చైతన్యం స్వచ్ఛత ఆరోగ్య అవగాహన విద్యాప్రధాన్నతం పై మేలుకొలుపు తీసుకురావడమే.ఈ క్యాంపు ద్వారా విద్యార్థులు గ్రామంలో వెళ్లి ప్రజలతో కలిసి పనిచేస్తూ పారిశుధ్యం ప్రాధాన్యం పరిశుభ్రమైన జీవన విధానం తల్లిదండ్రులు పిల్లల విద్య వైపు చూపాల్సిన శ్రద్ధ వంటి అంశాలపై అవగాహన కల్పిస్తూ అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు సమాచారం అందించి వాటిని సద్వినియోగం చేసుకునేలాప్రోత్సహిస్తారు. ముఖ్యంగా ప్రజల్లో స్వచ్ఛతతోనే ఆరోగ్యం సాధ్యమన్న భావన, చదువే అభివృద్ధికి మూలాధారం అన్న ఆలోచన,పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరి బాధ్యత, గ్రామ అభివృద్ధిలో ప్రజలే భాగస్వాముల అన్న చైతన్యం వంటివి బలపడతాయి. ఇది ఒక సేవా కార్యక్రమం మాత్రమే కాకుండా గ్రామాన్ని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దే మార్పుకు బీజం వేసే ఉద్యమంగా ఎన్ఎస్ఎస్ క్యాంపు పనిచేస్తుంది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రధాన్ ఉపాధ్యాయ బృందం పాఠశాల ఉపాధ్యాయులు ఎన్ఎస్ఎస్,వాలంటీర్లు, డిగ్రీ విద్యార్థులు, పాల్గొని విజయవంతం చేశారు. గ్రామ సేవా స్ఫూర్తి పెంపొందించా లని శిబిరం కొనసాగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ధారావత్ సుజాత నరసింహారావు. ఉప సర్పంచ్ శ్రీనివాసరావు. ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఈసం నారాయణ. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఖమ్మం ఎన్ఎస్ఎస్ యూనిట్ వన్ ప్రోగ్రాం ఆఫీసర్ రామ కుమారస్వామి. పి సావిత్రి. కవిత. సూర్యకుమారి. జానకిరామ్. సత్యనారాయణ. జానకి. విజయ. ఖమ్మం ప్రభుత్వం మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *