ప్రత్యర్థి వర్గంలో ముచ్చెమటలు పట్టించిన సర్పంచ్ వెంకటేష్. !!

సాక్షి, డిజిటల్ న్యూస్ . జనవరి 3 శంకరపట్నం..(శ్రీరాంపూర్ మంచిర్యాల జిల్లా) రాజకీయరంగంలో హోరా హోరుగా పోరాడీ. సర్పంచ్ పీఠాన్ని కైవసం చేసుకున్న ఓ కార్మిక యువ నేత సేగ్యం. వెంకటేశును గ్రామస్తులు. అధికారులు అభినందించారు . మందమర్రి మండలం వెంకటాపూర్ గ్రామంలో జరిగిన పంచాయతి సర్పంచ్.ఎన్నికల్లో నువ్వా నేనా అనే చందంగా ఎన్నికలు కొనసాగాయి . ప్రత్యర్థి వర్గం , వెన్నుపోటు దారులు, ఎన్నికల్లో మద్యం ఏరులై పారిన, డబ్బులు పంపిణీ చేసిన, ఎత్తులు పై ఎత్తులు మాత్రం వెంకటేష్ ఎదుట ఫలించలేదు,, వెంకటేష్ కుటుంబ సభ్యులు గత రెండు దశాబ్దాలకు పైగా అట్టడుగు వర్గాలకు సహాయం చేయడం,, అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం లాంటి సేవలే ఈ ఎన్నికల్లో వెంకటేష్కు ఎంతో ఫలితం ఇచ్చాయి,, ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. నాపై నమ్మకంతో గెలిపించిన ప్రజలకు ప్రతి ఓటర్కు వెంకటేష్ కృతజ్ఞతలు తెలిపారు.