సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 3, పాలకొండ నియోజకవర్గం ఇంచార్జ్, ( గంగాడ గౌరీ శంకర్ ) పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలం సామరిల్లి పంచాయతీలో గల సీది గ్రామంలో శ్రీ మేట్ దుర్గా సహిత మల్లికార్జున స్వామి వారి ఆలయ ప్రాంగణంలో శనివారం నాడు శ్రీ చిన్న జేఆర్ స్వామి వారి ఉపన్యాస కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఆలయ కన్వీనర్, మన్య ప్రగతి అధ్యక్షులు గేదెల జనార్దన్ రావు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కృప కటాక్షాలు పొందాలని కోరారు.