నేడు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

★కొండగట్టులో టీటీడీ సత్రం శంకుస్థాపన ★రూ 35.19 కోట్లతో వంద గదుల ధర్మశాల, మండప నిర్మాణం ★ఏర్పాట్లను పర్యవేక్షించిన అధికారులు

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 3 చొప్పదండి నియోజకవర్గం ఇంచార్జ్ కొండూరి సురేష్ జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆలయానికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు రానున్నారు. కొండగట్టులో రూ 35.19 కోట్లతో నిర్మించనున్న టీటీడీ సత్రానికి శంకుస్థాపన చేయమన్నారు.
ఈ నిధులతో కొండగట్టులో 100 గదుల ధర్మశాల,2 వేల మంది ఒకేసారి మాల విరమణ చేసే దీక్ష విరమణ మండపం నిర్మించనున్నారు.1100 మంది పోలీసులతో భారీ భద్రత కల్పించడంతోపాటు, శిలాఫలకం ఏర్పాటు చేసే చోట 600 మందికి సరిపడే భారీ తాత్కాలిక షెడ్డును నిర్మించారు. శనివారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే పర్యటన మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగుతుందని అధికారులు తెలిపారు.