సాక్షి డిజిటల్ న్యూస్ : 03 జనవరి 2026 మునుగోడు రిపోర్టర్ : (సునీల్ సులేమాన్) నలగొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి జన్మదిన వేడుకలు జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్ బోడ స్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో జిల్లా డీసీసీ అధ్యక్షులు పున్న కైలాష్ నేత ముఖ్యఅతిథిగా హాజరైనారు జిల్లా కేంద్రంలో మదర్ ధేరిస్సా నిర్మల్ హృదయ్ చారిటబుల్ ట్రస్ట్ నందు వృద్ధులకు కావలసిన నిత్యవసర వస్తువులు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం చారిటబుల్ సభ్యులు మానసిక వికలాంగులు మధ్య కేక్ కటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు కన్నారావు ,కిన్నెర శీను, అంబటి సోమన్న, ఎండి ముంతాజ్ అలీ, సుధాకర్ చింతమల్ల, వెంకటయ్య జిల్లా వెంకటేశ్వర్లు, రాంబాబు నాయుడు, జిల్లాపల్లి పరమేష్, గౌతమ్, రాజేందర్రెడ్డి, లింగయ్య ,పుట్టా వెంకన్న గౌడ్ ,దయాకర్ గౌడ్, ముచ్చపోతుల శ్రీనివాస్, కాటం వెంకన్న, గాజుల శ్రీనివాస్, శ్రీనివాస్ యాదవ్, సైదులు, సంతోష్ ,శరత్, వినీత్, కౌశిక్ ,తదితరులు పాల్గొన్నారు.
