దొనకొండకు తీవ్ర అన్యాయం చేసిన నాయకులకు ప్రజలే బుద్ధి చెప్తారు: డి బి హెచ్ పి యస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గొట్టిముక్కల సుజాత

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 3 గొట్టిముక్కల యోహాన్ త్రిపురాంతకం విలేఖరి దొనకొండ ను మార్కాపురం జిల్లాలో కలపాలని స్థానికులందరూ ప్రభుత్వాన్ని కోరినప్పటికీ ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా దొనకొండ ను ప్రకాశం జిల్లాలో కొనసాగించడం బాధాకరమని దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గొట్టిముక్కల సుజాత అన్నారు.ఈ రోజు దొనకొండలో జరిగిన విలేకరుల సమావేశంలో సుజాత మాట్లాడుతూ దొనకొండ కు జరిగిన అన్యాయంపై వివరించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని రేసు నుంచి వసతులు లేవని తప్పించడం.ఒంగోలు – దొనకొండ రైల్వే లైన్ లాభదాయకం కాదని ఆపివేసి, నడికుడి- శ్రీకాళహస్తి వైపు మొగ్గు చూపడం.మొట్టమొదటి కోస్తా ఇండస్ట్రియల్ కారిడార్ అయిన వైజాగ్ చెన్నై కారిడార్ (VCIC)లో దొనకొండ ఒక నోడ్ టౌన్ అయినప్పటికీ అభివృద్ధి పనులు లేకపోవడం.రాష్ట్ర రాజధాని కాలేదని చెప్పి, పారిశ్రామిక రాజధానిగా చేస్తామని మభ్య పెట్టడం.బ్రిటిష్ పాలన కాలం నుండి ఉన్న విమానాశ్రయాన్ని పట్టించుకోకుండా, ఒంగోలు లో ఏర్పాటుకు అనుకూలమని మాటమర్చడం.చివరి నిమిషం వరకూ మార్కాపురం జిల్లాలో కలుపుతామని అంటూనే, సుదూర జిల్లా కేంద్రమైన ఒంగోలు లోనే కొనసాగిస్తూ నూతన సంవత్సర వేడుకలకు దూరం చేయడం. ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నెన్నో అన్యాయాలు దొనకొండ వాసులకు పరిచయం అవసరం లేని వాస్తవాలు… ఏ ప్రభుత్వం మారిన దొనకొండ ప్రాంతానికి అభివృద్ధి అనేది అందని ద్రాక్షగా మిగిలిపోయింది. ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా దొనకొండ ను అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారని సుజాత ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *