తెలంగాణ రాష్ట్ర సీనియర్ వాలీబాల్ జట్లలో మంచిర్యాల జిల్లా క్రీడాకారుల ఎంపిక

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 03 మంచిర్యాల్ జిల్లా ప్రతినిధి లింగంపల్లి మహేష్, డిసెంబర్ 13-16 తేదీలలో మేడ్చల్ జిల్లా వేముల మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన సీనియర్ రాష్ట్రస్థాయి పోటీలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాలీబాల్ జట్లలో పాల్గొని మంచి ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు మంచిర్యాల పట్టణంకు చెందిన అంకం అనుదీప్, సోమగూడెంకు చెందిన షారుఖ్ లు తెలంగాణ పురుషుల జట్టుకు అస్నాద్ కు చెందిన ఇరుదండి. అనూష మహిళా జట్టు లో ఎంపిక అయినారు. ఈ నెల 4-11 తేదిలలో వారణాసి ( బనారస్) లో జరుగు 72వ సీనియర్ నేషనల్ వాలీబాల్ ఛాంపియన్షిప్ పోటీలలో తెలంగాణ రాష్ట్ర జట్ల తరుపున పాల్గొంటారు. ఈ విషయం పై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాలీబాల్ అధ్యక్షులు నల్ల శంకర్, ప్రధాన కార్యదర్శి మైలారం శ్రీనివాస్, ఉపాధ్యక్షలు బోరె యాదగిరి, భైరగోని సిద్దయ్య లు హర్షం వక్తం చేసారు. జాతీయ వాలీబాల్ క్రీడాకారులు రావుల రాంమోహన్, కొండా శ్రీనివాస్, లక్సట్టి గురువయ్య, చిందం శ్రీనివాస్, ఇంతియాజ్ పాషా లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాలీబాల్ పునర్ వైభం దిశగా సాగాలని అకాక్షించారు. సీనియర్ వాలీబాల్ క్రీడాకారులు జీల రమేష్, గడియారం మురళి,లక్సట్టి లక్ష్మినారాయణ,ఓలం రాజకుమార్, కుదురుపాక వీరేశం, పసునూటి కృష్ణ, సల్కాపురం రఘు, శ్రావణ్ కుమార్, కృష్ణస్వామి,ఉమర్ లు వారిని అభినందించారు.