సాక్షి డిజిటల్ న్యూస్:2 జనవరి, పాల్వంచ. రిపోర్టర్: కె.జానకిరామ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్వహించ నున్న ఉపాధ్యాయ అర్హత పరీక్షలు (టెట్), అభ్యర్థుల భవిష్యత్ తో ముడిపడి ఉన్న కీలక పరీక్షలు కావున. .పకడ్బందీగా, పారదర్శకంగా, ఎలాంటి లోపాలకు తావులేకుండా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ శుక్రవారం తెలిపారు. ఈ పరీక్షలు కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించబడతాయి కావున, అన్ని పరీక్ష కేంద్రాల్లో కంప్యూటర్లు, ఇంటర్నెట్ సిద్ధం చేయబడ్డాయి అని తెలిపారు. తెలంగాణలో టెట్ అర్హత పరీక్షలు జనవరి 3 నుండి జనవరి 20వ తేదీ వరకు, మొత్తం 9 రోజుల్లో 15 సెషన్లలో జరగనున్నాయి. మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుండి 11:30 గంటల వరకు, రెండవ సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుండి 4:30 గంటల వరకు నిర్వహించనున్నారు.