సాక్షి డిజిటల్ న్యూస్ డిసెంబర్ 3 కౌతాళం జ్ఞాన సుందరి నాటకానికి సహకరించిన జై భీమ్ సభ్యులకు కృతజ్ఞతలు: ఎరిగేరి దళిత నాయకులు జై భీమ్ వ్యవస్థాపకులు అవతారం మరియు సర్పంచ్ పాల్ దినకర్ గజమాలతో సత్కరించిన ఎరిగేరి సి.ఎస్.ఐ సంఘ పెద్దలు గత నెల డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగ పురస్కరించుకొని జ్ఞాన సుందరి నాటకాన్ని ఎరిగేరి దళిత నాయకులు ప్రదర్శించడం జరిగింది. ఆ నాటకానికి సహకరించిన జై భీమ్ వ్యవస్థాపకులు అవతారం, మరియు సర్పంచ్ పాల్ దినకర్, బాపురం జయపాల్, ఎరిగేరి సంఘ పెద్దలు మరియు దళిత నాయకులు గజమాలతో సత్కరించడం జరిగింది. జ్ఞాన సుందరి నాటకం విజయవంతం కావడం పట్ల గ్రామస్తులు హర్ష వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వసంత్, సల్మాన్ , నాగేంద్ర, మాజీ ఎస్ఎఫ్ఐ వీరేష్, రాజు, అయ్యప్ప, గ్రామస్తులు పాల్గొన్నారు.