జీవాలకు నట్టల నివారణ మందు పంపిణీ చేసిన సర్పంచ్ మరియు పశువైద్యాధికారి

సాక్షి డిజిటల్ న్యూస్, జనవరి 03:, రిపోర్టర్, తిరుపతి సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని విశ్వనాద్ పల్లి & రవీంద్ర నగర్ గ్రామంలో శుక్రవారం రోజు సర్పంచ్ కోడెల కవిత రవి , ఉప సర్పంచ్ కోడెల కిరణ్ కుమార్ , పశువైద్యాధికారి శ్రీనివాస్ తో కలిసి జీవాలకు నట్టల నివారణమందు పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కోడెల కవిత రవి మాట్లాడుతూ…ప్రభుత్వము పశుసంవర్ధక శాఖ ద్వారా ప్రతి సంవత్సరం జీవాలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేస్తుంది. వీటి ముఖ్య ఉద్దేశ్యం గొర్రెలు, మేకలు వంటి జీవాలు నులిపురుగుల బారిన పడకుండా ఉంటూ, గొర్రెలు మేకలు పోషకాలను గ్రహించి బరువు పెరగడానికి, వేగంగా వృద్ధి చెందుతాయని, మరణాల రేటు తగ్గుతాయి. చివరికి గొర్రెలు, మేకల పెంపకం దారుల ఆదాయాన్ని పెంచుతాయి అన్నారు. ఈ మందులు ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తుందని తెలియజేయడం జరిగింది. రైతులకు తమ జీవాలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి పశువైద్యాధికారి సలహా సూచనలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు వెంకటేష్, కనకరాజు, జి.రవి, కె రవి, భూపతి, శ్రీధర్ చారి, ఉమా రైతు లుతదితరులు పాల్గొన్నారు.