జిల్లా ప్రజలకు కలెక్టర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు

★కొత్త ఏడాదిలో మరింత సేవాభావం

సాక్షి డిజిటల్ న్యూస్,3 జనవరి 2026, రామన్నపేట మండలం రిపోర్టర్,శ్యామల నాగరాజు వంశరాజ్: యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు శుక్రవారం ఆంగ్ల నూతన సంవత్సరం ప్రారంభం అయిన నేపథ్యంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు, వారి సిబ్బంది కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పేద విద్యార్థులకు ఉపయోగపడే బుక్స్, పెన్లు, దుప్పట్లు తదితర వస్తువులను కలెక్టర్‌కు అందజేశారు. ఈ కార్యక్రమం సార్థకతను చాటింది.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు నడిపేందుకు నిరంతరం సహకరిస్తున్న ప్రజాప్రతి నిధులు, అధికారులు, మీడియా ప్రతినిధులు, ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ, జిల్లా సమగ్రాభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.నూతన సంవత్సరంలో మరింత సేవాభావంతో ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.