జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే షాజహాన్లను మర్యాద పూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ నాయకులు

*దళితుల భూ సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందజేసిన ఎమ్మార్పీఎస్ నాయకులు

సాక్షి డిజిటల్ న్యూస్ :3 జనవరి 2026 తంబళ్లపల్లి నియోజకవర్గ ఇన్చార్జి రమేష్ బాబు( రాము) అన్నమయ్య జిల్లా, మదనపల్లి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, మదనపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు షాజహాన్ భాషను శుక్రవారం ఎం ఎస్ పి జాతీయ నాయకులు సొట్టా నరేంద్రబాబు ఆధ్వర్యంలో తంబళ్లపల్లి నియోజకవర్గం ఎంఆర్పిఎస్, ఎంఎస్పి నాయకులు నూతనంగా ఏర్పడిన మదనపల్లి అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ కు దుశ్యాలవలతో పూలమాలవేసి సన్మానించడం జరిగింది. అన్నమయ్య జిల్లాకు చెందిన తంబళ్ల పల్లి, మదనపల్లి, పుంగనూరు, పీలేరు, రాయచోటి, నియోజకవర్గాలకు చెందిన దళితుల భూ సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. త్వరలో అన్ని నియోజకవర్గాలలో పర్యటించి సమస్యలను పరిశీలిస్తానని జిల్లా కలెక్టర్ తెలిపారు. అనంతరం మదనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు షాజహాన్ భాషను కలసి పూలమాల దుశాల వాళ్ళతో సన్మానించడం జరిగింది. మదనపల్లిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని జేఏసీని ఏర్పాటుచేసి ఉద్యమించడం, మదనపల్లిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లడం, శాసనసభలో మదనపల్లి గురించి తెలియజేసి జిల్లా కేంద్రంగా చేయాలని పట్టుబట్టడం వంటివి చేసి, ప్రభుత్వం మదనపల్లిని జిల్లా కేంద్రంగా ప్రకటించేందుకు చేసిన కృషిని శాసనసభ్యులు షాజహాన్ బాషా ను ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి నాయకులు అభినందించారు. జిల్లా అభివృద్ధి కోసం మరింతగా కృషి చేస్తానని షాజహాన్ బాషా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పి జాతీయ నాయకులు సొట్ట నరేంద్రబాబు మాదిగ, వాసు, సురేంద్ర, తంబళ్లపల్లి నియోజకవర్గం ఎంఎస్పి గౌరవ అధ్యక్షులు రిటైర్డ్ టీచర్ ఆదినారాయణ, ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు ప్రతాప్ కుమార్, ఇన్చార్జి తిరుపాల్ మాదిగ, బి కొత్తకోట ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు చౌడప్ప, రమణ, కురబలకోట ఎమ్మార్పీఎస్ నాయకులు రమణ, తెట్టు కుమార్, సుధాకర్, కనసానిపల్లి కుమార్, పిటిఎం మండలం ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మబ్బు చంద్ర, ఇన్చార్జి మల్లెల రవి, పెద్దమండెం మండలం ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు జయమ్మ, రాములమ్మ, అంజి, తంబళ్లపల్లె మండల సీనియర్ నాయకులు మల్లికార్జున, వెంకటప్ప, ములకలచెరువు మండల ఎమ్మార్పీఎస్ గౌరవ అధ్యక్షులు తుడుం శ్రీరాములు, అధ్యక్షులు మల్లికార్జున, కార్యదర్శి హరి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *