సాక్షి డిజిటల్ న్యూస్. జనవరి.03, వేములవాడ. ఆర్. సి. ఇంచార్జ్: సయ్యద్ షబ్బీర్… వేములవాడ పట్టణం లో తేదీ:2-1-2026 శుక్రవారం రోజున మధ్యాహ్నం 2:00 గంటలకు తెలంగాణ ఉద్యమకళకారుల ప్రధాన కార్యాలయం నందు జరిగిన సమావేశంలో కళాకారుల విభాగం రాష్ట్ర కన్వీనర్ కళాతపస్వి యెల్ల పోశెట్టి మాట్లాడుతూ (TUF) తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కళాకారుల విభాగం పక్షాన ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ జనవరి4-1-2026 ఆదివారం నుండి ఉద్యమకారుల రిలే నిరాహార దీక్షలు హైదరాబాద్ లోని జయశంకర్ సార్ ప్రాంగణం అల్వాల్ నందు ఉద్యమకారుల ఫోరం వ్యవస్థాపకులు రాష్ట్ర అధ్యక్షులు డా” చీమ శ్రీనివాస్ రావు గారి ఆధ్వర్యంలో ప్రారంభమగును ఉద్యమ కళాకారులు రచయితలు కవులు సాహితీవేత్తలు వివిధ జిల్లాల అధ్యక్షులు ఉపాధ్యక్షులు కన్వీనర్లు కో-కన్వీనర్లు బాధ్యతలు తీసుకొని దీక్ష శిబిరానికి హాజరై సంఘీభావాన్ని తెలుపాలని కోరుచున్నాము ఈ సమావేశంలో ఉత్తర తెలంగాణ కళాకారుల విభాగం కో-ఆర్డినేటర్ బొడ్డు రాములు గడ్డం సుధాకర్ వెన్నమల్ల వెంకటేష్ తదితర జిల్లాల ఇన్చార్జులు పాల్గొన్నారు