సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 3 యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం రిపోర్టర్ ముషం శ్రీనివాస్, మోత్కూరు అడ్డగూడూరు మండలాల కౌన్సిల్ సమావేశం చాపల అంజయ్యఅధ్యక్షతన జరిగినది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి జిల్లా పార్టీ సహయకార దర్శి చేడె చంద్రయ్య మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 1925 డిసెంబర్ 26న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ పట్టణంలో సిపిఐ పార్టీగా ఆవిర్భవించింది. ఆనాటి నుండి స్వాతంత్ర పోరాటం అలాగే తెలంగాణ సాయుధ పోరాటం నడిపిన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీని ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్నదని ఈ రెండు మండలాల ప్రజా సమస్యలపై పార్టీ శ్రేణులు నిరంతరం పోరాటం చేయాలని అలాగే ఈ నెల 18వ తారీకు రోజు ఖమ్మంలో జరుగు తున్న లక్షలాదిమంది బహిరంగ సభకు మేధావులు విద్యావేత్తలు యువతీ యువకులు సానుభూతిపరులు అందరూ పాల్గొని బహిరంగ సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మోత్కూరు అడ్డగూడూరు మండలంలో కార్యదర్శులు అన్నపు వెంకట్ రేకుల శ్రీనివాస్ సహాయ కార్యదర్శిలు పులకరం మల్లేష్ కందుకూరి వెంకన్న మొగుళ్ల శేఖర్ రెడ్డి బుష్పక నరసింహమాధవి కొము రాములు పోచం కన్నయ్య చెడేనగేష్ బొనిగ సుదర్శన్ రెడ్డి ఎండి అబ్బ సాయిలు దొండ ఎల్లయ్య గొలుసుల యాదగిరి వెంకటేశ్వర్లు చెడే సుందరయ్య యాట రామచంద్రు బోడ సోమ నరసయ్య తదితరులు పాల్గొన్నారు.