సాక్షి డిజిటల్ న్యూస్, జనవరి 3 కోట మండల రిపోర్టర్ వెంకట కృష్ణయ్య, కోట మండలం భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా అధ్యక్షుడు షేక్ కరీముల్లా శుక్రవారం ఆకస్మికంగా మృతి చెందారు. భారతీయ జనతా పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన షేక్ కరిముల్లా మృతికి పలువురు భారతీయ జనతా పార్టీ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కరిముల్లా భౌతిక కాయానికి శనివారం అంతిక్రియలు జరగనున్నాయి.