కొమ్మయిగుడెం అభివృద్ధిపై ఎమ్మెల్యేతో చర్చించిన గ్రామ సర్పంచ్ మల్లారెడ్డి

★నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ…..ఎమ్మెల్యే వీరేశంకు పూలబోకే అందజేసిన సర్పంచ్ మల్లారెడ్డి

సాక్షి డిజిటల్ న్యూస్, 3 జనవరి 2026,రామన్నపేట మండలం రిపోర్టర్, శ్యామల నాగరాజు వంశరాజ్: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం కొమ్మయిగుడెం గ్రామ సర్పంచ్ మారేపల్లి మల్లారెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మర్యాదపూర్వకంగా కలిసిన ఆయన, పూలబోకేను అందించి 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా కొమ్మయిగుడెం గ్రామ అభివృద్ధి, పెండింగ్‌ లో ఉన్న ప్రజా సమస్యలు, మౌలిక వసతుల అవసరాలపై ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.గ్రామాభివృద్ధికి సంబంధించిన అంశాలపై సర్పంచ్ వినిపించిన సూచనలను ఎమ్మెల్యే సానుకూలంగా స్వీకరిస్తూ, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ భేటీలో కాంగ్రెస్ నాయకులు ఎర్ర శేకర్ గౌడ్, మారేపల్లి జగన్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.