సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 03 మంచిర్యాల్ జిల్లా ప్రతినిధి లింగంపల్లి మహేష్, మంచిర్యాల పట్టణంలోని ఐబి చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కేంద్ర ప్రభుత్వం సావిత్రిబాయి పూలే జయంతిని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మోకాళ్లపై నిలుచుని నిరసన వ్యక్తం చేస్తూ నాయకులు మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు అయిన సావిత్రిబాయి పూలేను కేంద్ర ప్రభుత్వం గుర్తించకపోవడం అంటే ఇది బీసీ మహిళల పట్ల వివక్షగా భావిస్తున్నాం. మహిళలు వంటింటికే పరిమితమైన రోజుల్లో మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్న కాలంలోనే మహిళలకు చదివేంటి అనే కాలంలోనే చదువుకొని ఉపాధ్యాయ వృత్తిని చేతబూని అణగారిన కులాలకు చదువు ప్రాముఖ్యతను చెప్పి అనేక పాఠశాలలను ప్రారంభించి చదువు చెప్పిన ధీరవనితకు కేంద్ర ప్రభుత్వం సరైన గుర్తింపు ఇవ్వాలంటే సావిత్రిబాయి జయంతిని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం గా నిర్వహించాలి. అలాగే భారతరత్న ప్రకటించి కేంద్ర సెక్రటేరియట్ లో సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని ప్రతిష్టించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేనిపక్షంలో సావిత్రిబాయి పూలేకు భారతరత్న సాధించేవరకు అదేవిధంగా కేంద్ర సెక్రటేరియట్ లో విగ్రహం ప్రతిష్టించేంత వరకు సావిత్రిబాయి పూలే జయంతిని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం గా ప్రకటించేంత వరకు బీసీ మహిళలను చైతన్యం చేసి ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి శాఖ పోరి భీమ్సేన్ ,రాష్ట్ర బీసీ నాయకులు గజెల్లి వెంకటయ్య, చంద్రగిరి చంద్రమౌళి, రాజన్న చారి,చెలిమల అంజయ్య , కీర్తి బిక్షపతి, అంకం సతీష్, వేముల అశోక్, భీం రావ్ తదితరులు పాల్గొన్నారు.