కాంగ్రెస్ సీనియర్ నాయకులు సుందర్ నాయక్ కన్నుమూత: నివాళులర్పించిన సర్పంచ్ హీరాలాల్

సాక్షి డిజిటల్ న్యూస్/కారేపల్లి/(జనవరి 3) సింగరేణి మండల కాంగ్రెస్ పార్టీలో తొలి తరం నాయకుడిగా గుర్తింపు పొందిన, మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగలరావు నమ్మకస్తుడైన గుగులోత్ సుందర్ నాయక్ (96) శుక్రవారం వృద్ధాప్య కారణాలతో కన్నుమూశారు. ఆయన మృతి మండల కాంగ్రెస్ శ్రేణులకు తీరని లోటు.
​భాగ్యనగర్ తండా వాసి అయిన సుందర్ నాయక్ భౌతిక కాయాన్ని సర్పంచ్ బానోత్ హీరాలాల్ సందర్శించి, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ​ కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలోనూ, బలోపేతంలోనూ సుందర్ నాయక్ పోషించిన పాత్ర చిరస్మరణీయమని సర్పంచ్ ఈ సందర్భంగా కొనియాడారు. ​ ఆయన మృతి పట్ల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ​ఈ కార్యక్రమంలో సుందర్ నాయక్ చివరి వీడ్కోలు పలకడానికి పలువురు నేతలు హాజరయ్యారు. ​మాజీ ఎంపీటీసీ బానోత్ రాంచందర్ ​సీనియర్ నాయకులు బానోత్ రాందాస్, వాంకుడోత్ హతీయ, లావుడ్యా ఈర్య ​ గాంధీ, రాంబాబు, దిలీప్, అశోక్, నగేష్, సుమ, లీలా
​కుటుంబ సభ్యులు: లాల్ చంద్, లక్ష్మిదాస్, శివాజీ మరియు బంధుమిత్రులు తదితరులు పాల్గొనడం జరిగింది.