కరెంట్ ఫోల్ మంజూరు చేయండి.

సాక్షి డిజిటల్ న్యూస్ ప్రతినిధి దాసరి శ్రీనివాస్ జనవరి 3, కరెంట్ ఫోల్ మంజూరు చేయాలని మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని కిష్టంపేట ఐదవ వార్డు ప్రజలు సర్పంచ్ సార్ల తిరుపతికి వినతిపత్రం అందజేశారు. అనంతరం మాజీ ఉపసర్పంచ్ దామయ్య మాట్లాడుతూ ఐదో వార్డులో కరెంట్ ఫోల్ దూరంగా ఉండటం వలన అక్కడున్న నివాసాలకు సర్వీస్ వైర్ ఎక్కువగా పడుతుందని వర్షాకాలంలో గాలి దుమారా లకు కోతుల ఆటలకు వైర్లు తెగిపోతున్నాయని అన్నారు. త్వరగా కరెంటు ఫోల్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు పాల్గొన్నారు.