సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 3 భద్రాచలం రిపోర్టర్ గడ్డం సుధాకర్ రావు, ఉన్నతమైన ఆలోచనలతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభించాలని భద్రాచలం తాసిల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు కోరారు. శుక్రవారం తాసిల్దార్ కార్యాలయంలో రేషన్ డీలర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలలో తాసిల్దార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం లో జరిగిన అనుభవాలను తీసుకొని భవిష్యత్తుపై ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్లాలని కోరారు. భద్రాచలం రేషన్ డీలర్స్ అసోసి యేషన్ ఆధ్వర్యంలో అనేక రకాల సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనటం అభినందనీయమని అన్నారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడం లో రేషన్ డీలర్ల కీలకపాత్ర అని ఎమ్మార్వో అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్నబిఏ పథకం ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని కొత్తగా కార్డులు పొందిన ప్రతి కుటుంబానికి సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సందీప్ పట్టణ రేషన్ డీలర్స్ పండు తదితరులు పాల్గొన్నారు.