సాక్షిడిజిటల్ న్యూస్, జనవరి 03, రాయికల్: జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మైతాపూర్ ఉన్నత పాఠశాలలో ఉద్యోగ విరమణ పొందిన అటెండర్ తలారి పెద్ద భీమయ్య దంపతులను ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు శుక్రవారం ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో సర్పంచి తలారి నాగమణి రాజేష్, ఉప సర్పంచ్ దొంగ ప్రణయ్ రెడ్డి, మండల విద్యాధికారి శ్రీపతి రాఘవులు, ప్రధానోపాధ్యాయులు ముక్కాల మోహన్ రెడ్డి, పాఠశాల కమిటీ ఛైర్మన్ శ్యామల, ఉపాధ్యాయులు వేముల మధు, కల్వకోట కార్తీక్, వేమూగంటి గిరిధర్, అంతడుపుల గంగారాజం, రాపర్తి నర్సయ్య, కొండూరి రజినీకాంత్, సిద్దె గంగారాజం లు పాల్గొన్నారు.