ఈవీఎం గోడౌన్ ను తనిఖీ చేసిన కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

★ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు తనిఖీ.

సాక్షి డిజిటల్ న్యూస్:2 జనవరి, పాల్వంచ. రిపోర్టర్: కె.జానకిరామ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలోని ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ జితేష్ వి. పాటిల్ శుక్రవారం తనిఖీ చేశారు. ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఈవీఎం భద్రతకు సంబంధించి ప్రతి నెల తనిఖీ చేయడం జరుగు తుందని, ఇందులో భాగంగానే తనిఖీ చేయడం జరిగిందని, సీసీ కెమెరాల పనితీరు పరిశీలించడం జరిగిందని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. అనంతరం కలెక్టర్ గోడౌన్ పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచాలని, అనుమతి లేనిదే ఎవరిని లోపలికి అనుమతించరాదని అధికారులకు తెలిపారు. ఈ తనిఖీలో ఎన్నికల సూపర్డెంట్ రంగప్రసాద్, ఎన్నికల సిబ్బంది నవీన్, తదితరులు పాల్గొన్నారు.