సాక్షి డిజిటల్ న్యూస్ రావికమతం : వృత్తినే దైవంగా నమ్మడమే కాక విధి నిర్వహణలో ప్రత్యేక శ్రద్ధ కనబరిచి అధిక మొత్తంలో ఇంటి పన్నులను వసూలు చేసిన కొత్తకోట పంచాయతీ జూనియర్ అసిస్టెంట్ నాగ వరలక్ష్మి ని సర్పంచ్, కోన లోవరాజు,ఉప సర్పంచ్ పందల దేవ,ఈ ఓ జ్యోతే శ్వర రెడ్డి తదితరులు శుక్రవారం ఘనంగా సన్మానించారు. కొత్తకోట పంచాయతీలో మూడేళ్లుగా విధులు నిర్వహిస్తున్న ఆమె అధికారులు నాయకులతో పాటు ప్రజలతోనూ స్వామ్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. చిరునవ్వుతో పలకరిస్తూ వసూళ్లపై దృష్టి సారిస్తూ ఉంటారు. సమయానికి ముందే విధులకు హాజరవ్వడం పని ఒత్తిడి సమయంలోనూ ఎంత లేట్ అయిన పని ముగించుకొని వెళ్తూ పలుమార్లు పాలకులు అధికారుల ప్రశంసలను అందుకున్నారు. దీనిలో భాగంగానే 2025-26 ఏడాది లో రూ. 30 లక్షల ఇంటి పన్నుల లక్ష్యం కాగా ఇప్పటికే సుమారు రూ. 10 లక్షలకు పైగా ఇంటి పన్నులు వసూళ్ళు లలో చురుగ్గా పాల్గొని టార్గెట్ ను అధికమిం చే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ ఓ ఆదేశాలు మేరకు ఆమె ప్రతి రోజు ఉదయం 6 గంటలకే విధులకు హాజరై బిల్లు కలెక్టర్, సచివాలయ సిబ్బంది తో పాటు ఇంటింటికి తిరిగి పన్నులు వసూళ్ళు కు ఆమె చేస్తున్న శ్రమను గుర్తించి ఈ సన్మానం చేసామని వారు తెలిపారు.ఈ కార్యక్రమం లో మాజీ ఉప సర్పంచ్ కే. గున్నాజి, వార్డు సభ్యలు, పలువురు వైసీపీ నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు..శేషు రావికమతం.
