సాక్షి డిజిటల్ న్యూస్ 2-1-2026 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల రిపోర్టర్ నాగేంద్ర,
దమ్మపేట మండలంలో స్థానిక ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. యూనియన్ ప్రెసిడెంట్ సంకు రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ప్రెసిడెంట్ దారా యుగంధర్ మరియు పెద్ద గొల్లగూడెం బిఆర్ఎస్ వైస్ ప్రెసిడెంట్ ఆటో యూనియన్ ముత్తిని రామకృష్ణ ఘనంగా సత్కరించారు. ఆటో యూనియన్‌కు వారు అందిస్తున్న సేవలను గుర్తిస్తూ, సంకు రమేష్ ఆధ్వర్యంలో దారా యుగంధర్ మరియు ముత్తిని రామకృష్ణలను శాలువాతో కప్పి, ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత దారా యుగంధర్ మాట్లాడుతూ.. ఆటో కార్మికుల కష్టసుఖాలు తనకు తెలుసని, యూనియన్ సభ్యులందరికీ ఏ ఆపద వచ్చినా ఎల్లప్పుడూ అండగా ఉంటానని మాట ఇచ్చారు. ముత్తిని రామకృష్ణ తనను సన్మానించినందుకు యూనియన్ సభ్యులకు ముత్తిని రామకృష్ణ కృతజ్ఞతలు తెలియజేస్తూ, యూనియన్ బలోపేతానికి తన వంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మౌలాలి, హరి, రాంబాబు, బాబురావు, శ్రీరామ్మూర్తి, శివ ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.