అంగన్వాడి కేంద్రం లో పిల్లలకు యూనిఫామ్.

సాక్షి డిజిటల్ న్యూస్ జనవరి 3 (పాలేరు రిపోర్టర్ పి వెంకన్న) కూసుమంచి మండల కేంద్రంనికి సంబంధించిన అంగన్వాడి కేంద్రాల్లో పిల్లలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చే సీఎం రేవంత్ రెడ్డి స్థానిక శాసనసభ సభ్యులు తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ గృహనిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వ పాఠశాల తరహాలో అంగన్వాడి పిల్లలకు యూనిఫామ్స్ అందించాలని ఉద్దేశంతో కూసుమంచి సర్పంచ్ కొండ కృష్ణవేణి ఉప సర్పంచ్ చెన్ను వెంకటరమణా చేతులమీదుగా పిల్లలకు యూనిఫామ్స్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిడిపిఓ కవిత. సూపర్వైజర్ సువ్వచ్చల. అంగన్వాడి టీచర్స్ 12వ వార్డు మెంబెర్ అర్వపల్లి ఉపేందర్. స్థానిక ప్రాథమిక పాఠశాల సిబ్బంది ఆయా అంగన్వాడి పరిధిలోగల పిల్లల తల్లిదండ్రులు గ్రామస్తులు పాల్గొన్నారు.