సాక్షి డిజిటల్ న్యూస్ డిసెంబర్ 31 అచ్చంపేట (రిపోర్టర్ కొమ్ము రేణయ్య) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం రేషన్ షాపుల ద్వారా అందిస్తున్న సన్న బియ్యం అధికారుల నిర్లక్ష్య ధోరణితో విమర్శలకు దారితీస్తోంది తాజాగా అచ్చంపేట పట్టణంలోని ఎఫ్ సి ఐ గోదాంలో నిల్వ ఉంచిన రేషన్ బియ్యం పురుగులు పట్టి తుట్టెలు కట్టి తినడానికి పనికి రాకుండా పోయాయి కాని పేద ప్రజలేకదా ఏవైనా తింటరు అనే అక్కసుతో అధికారులు వాటిని గాలికి ఆరబెట్టి సంచుల్లో నింపి పంపిణీకి సిద్ధం చేస్తున్నారు ఈ సంఘటనపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సంబంధిత అధికారులు స్పందించి పాడైపోయిన బియ్యాన్ని ఇవ్వకుండా నాణ్యమైన బియ్యం పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.