సాక్షి డిజిటల్ న్యూస్ హోళగుంద డిసెంబర్ 31 ప్రతి ఒక్క విద్యార్థి పదవ తరగతి పరీక్షల్లో 100% ఉత్తీర్ణుత సాధించాలని ఆలూరు నియోజకవర్గం ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి అన్నారు ఈ సందర్భంగా మండల కేంద్రమైన హోళగుంద లోనీ స్థానిక కస్తూరిబా బాలికల పాఠశాలలో ఆమె సందర్శించి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లను పంపిణీ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ చదువు వల్ల వ్యక్తిగత ఎదుగుదల, ఆర్థిక స్థిరత్వం, మంచి ఉద్యోగావకాశాలు, ఆత్మవిశ్వాసం, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం, సమాజంపై అవగాహన వంటి ఎన్నో లాభాలు ఉన్నాయన్నారు, ఇది మన జీవితానికి సరైన దిశానిర్దేశం చేసి, విముక్తి కలిగిస్తుందనీ.ప్రతి ఒక్క విద్యార్థి కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అన్నారు విద్యార్థులకు పాఠాలు అర్థం కాకపోతే ఉపాధ్యాయులతో మళ్ళీ మళ్ళీ అడిగించి తెలుసుకొని చదువుకోవాలని సూచించారు నేటి సమాజంలో విద్య తోనే ఏదైనా సాధించవచ్చు అని ఆమె పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య కేజీబీవీ ఎస్ ఓ దివ్యభారతి పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ అబ్దుల్ సుభాన్ సిబిఎన్ ఆర్మీ ముల్ల మోయిన్ ఐ టి డి పి మల్లికార్జున రాష్ట్ర మైనార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి ఆదాం జనసేన మండల అధ్యక్షులు అశోక్ ఆలూరు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గజ్జహల్లి ముల్లా నబి రసూల్ పెద్ద హ్యాట వీరేష్ తోక వెంకటేష్ విద్యార్థులు పాల్గొన్నారు.