సాక్షి డిజిటల్ న్యూస్ హొళగుంద డిసెంబర్ 31 కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ఎన్టీఆర్ భరోసా” పెన్షన్ల పంపిణీ కార్యక్రమం హోళగుంద మండల కేంద్రంలోనీ అత్యంత వైభవంగా, ఒక పండుగలా జరిగిందని ఆలూరు నియోజకవర్గం ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి అన్నారు ఈ సందర్భంగా బుధవారం పింఛన్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైకుంఠం జ్యోతి హాజరయ్యారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన నియోజక వర్గ ఇంచార్జి వైకుంఠం జ్యోతి స్వయంగా లబ్ధిదారులకు పెన్షన్లు అందజేసి, వారి ముఖాల్లో చిరునవ్వులు నింపారు.ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పెంచిన పెన్షన్లతో ప్రతి పేదవాడి ఇంట్లో వెలుగులు నింపడమే మన లక్ష్యం అని ఆమె పేర్కొన్నారు. తరలివచ్చిన లబ్ధిదారులు మరియు ప్రజలు వృద్ధులు, వికలాంగుల పట్ల జ్యోతి ఆత్మీయ పలకరింపు పండుగ వాతావరణంలో సాగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అన్నారు కూటమి ప్రభుత్వం – ప్రజా ప్రభుత్వం! అనీ వారు తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా ఇచ్చిన పెన్షన్లు పేదలకు వరంలా నిలుస్తోందని ఆలూరు టిడిపి ఇన్చార్జి వైకుంఠం జ్యోతి అన్నారు. టిడిపి కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య,కో కన్వీనర్ జాకీర్,సొసైటీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి,పార్లమెంటరీ ఆర్గనైజేషన్ సెక్రటరీ అబ్దుల్ సుభాన్,ఆలూరు మార్కెట్ యార్డు డైరెక్టర్ నబి రసూల్,సీనియర్ నాయకులు ఈబిజీ గోవింద్ గౌడ్,సిహెచ్.శేషగిరి,తోకా వెంకటేష్,బాగోడి రాముడు,మాజీ కన్వీనర్ వీరన గౌడ్,దుర్గయ్య,తెలుగు యువత ప్రెసిడెంట్ బకాడి వీరేష్,బిజెపి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ చిదానంద, ప్రసాద్,ఉలిగన్న,జనసేన అశోక్,వరాల వీరేష్, ఎంపిడివో విజయ లలిత,డిప్యూటీ ఎంపీడీవో చక్రవర్తి, పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ గౌడ్ సచివాలయ సిబ్బంది తదితరుల ఆధ్వర్యంలో భరోసా పెన్సన్లను లబ్దిదారులకు పంపిణీ చేసారు.అదికారులు, టీడీపీ నాయకులతో కలిసి లబ్దిదారుల ఇళ్లకు వెల్లిన టిడిపి ఇన్చార్జి వైకుంఠం జ్యోతి పెన్షన్ దార్లను కలిసి వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన పెన్షన్ మొత్తాన్ని వారికి అందచేసారు. కూటమి ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలోను లేని విదంగా పెద్దమొత్తంలో పెన్షన్లు అందచేస్తోందని తెలిపారు. ప్రతీ నెలా ఒకటో తేదీన అధికారులు ఇంటివద్దకే వచ్చి పెన్షన్లు అందించడం దేశంలో మొదటిసారి అని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు కొండంత భరోసానిస్తున్నాయని వెల్లడించారు. ప్రజల కష్టాలు తెలిసిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రమేనని, సమాజంలో ప్రతీఒక్కరు ఎదగాలని నిరంతరం తపన పడుతుంటారని తెలిపారు. గ్రామంలో సిసి రోడ్లు, సిమెంట్ కాలువల నిర్మాణానికి నిధులు మంజూరుకు అత్యంత ప్రాధాన్యత నిచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు రాష్ట్ర మైనారిటీ కార్య నిర్వాహక కార్యదర్శి ఆదాం , సిబిఎన్ ఆర్మీ ముల్ల మోయిన్ అయ్యప్ప అబ్దుల్ రహిమాన్ ఐటిడిపి భాస్కర్ , హనుమంతు,గొల్ల తిమ్మారెడ్డి, మల్లికార్జున, తిక్క స్వామి ఉమామహేశ్వర్ కార్యకర్తలు పాల్గొన్నారు.
