సాక్షి డిజిటల్ న్యూస్ డిసెంబర్ 31 (పాలేరు రిపోర్టర్ పి వెంకన్న) పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం మండలం మాదిరిపురం గ్రామం వద్ద చంద్రబాబు నాయుడు పాద యాత్ర 100 రోజులు పూర్తి అయిన సందర్భంగా 100 అడుగుల పైలాన్ ని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. దానికి తగిన మరమ్మత్తులు చేయటానికి హెరిటేజ్ సంస్థ ల ఎండి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి దానిపై దృష్టి పెట్టి అన్ని హంగులతో దానిని మరమ్మత్తు చేయుచున్నారు. ఈ రోజు అక్కడ జరుగుతున్న పనులను పాలేరు నియోజకవర్గ నాయకులు జిల్లా అడహక్ కమిటీ సభ్యులు కొండబాల కరుణాకర్ పరిశీలించి అక్కడ సిబ్బంది తో మాట్లాడి తగు సూచనలు చేసారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే దిశగా చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టారని మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికలలో అనేక గ్రామాలలో సర్పంచ్, ఉపసర్పంచ్ మరియు వార్డ్ మెంబర్లను గెలుచుకున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మల్లెంపాటి అప్పారావు, గడిపూడి వెంకటేశ్వరరావు, నల్లమోతు సత్యనారాయణ, రాయలకోటేశ్వరరావు, కామినేని శ్రీనివాస్, కర్ణాటి అశ్వనీకుమార్, మల్లెంపాటి లహరిన్, మాజీ ఎంపీటీసీ పోలెపొంగు సాలయ్య, యాతాకుల సత్యం. మరియు పలువురు గ్రామ శాఖల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.