సాక్షి డిజిటల్ న్యూస్ అచ్చంపేట (రిపోర్టర్ కొమ్ము రేణయ్య) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల ఆర్థికాభివృద్ధి కోసం అందించే వివాహా ప్రోత్సాహాన్ని ఉపయోగించుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి కె రాజేశ్వరి తెలియజేశారు దివ్యాంగులు సాధారణ వ్యక్తులను లేదా మరో దివ్యాంగున్నీ వివాహం చేసుకుంటే ప్రభుత్వం లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తుందని అర్హులైనవారు ఉపయోగించుకొవాలన్నారు వివాహమైన ఏడాది లోపు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు జిల్లా కలెక్టర్ ఆమోదంతో సంక్షేమ అధికారులు ఈ మొత్తాన్ని అందిస్తారన్నారు.