సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు

సాక్షి డిజిటల్ న్యూస్, నవంబర్ 07,రిపోర్టర్ తిరుపతి, సిద్దిపేట పోలీస్ కమిషనర్ S.M విజయ్ కుమార్ IPS మాట్లాడుతూ*సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ 7 (1), 2016, యాక్ట్, 22 (1) (a )నుండి (f ) మరియు 22 (2) (a) & ( b), & 22 (3) సిటీ పోలీస్ యాక్ట్, 1348 No IX ఫాస్లి సెక్షన్ 30 పోలీస్ యాక్టు 1861 ప్రకారం *తేది 09-11-2025 ఉదయం 6:00 నుండి 24-11-2025 ఉదయం 6 గంటల వరకు ఆమలులో వుంటుంది. కమిషనరేట్ పరిధిలో ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదు. పైన పేర్కొన్న కార్యక్రమాల నిర్వహణకు ముందుగా పోలీస్ అధికారుల అనుమతి తీసుకోవాలి, బంద్ ల పేరిట వివిధ కారణాలను చూపుతూ బలవంతంగా వివిధ సంస్థలు, కార్యాలయాలను మూసి వేయాలని ఒత్తిడి, బెదిరింపులకు గురిచేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. మరియు శాంతిభద్రతల పరిరక్షణ నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని పోలీస్ కమిషనర్ సూచించారు.సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో డిజె సౌండ్ వినియోగంపై నిషేధాజ్ఞలు తేదీ: 09-11-2025 ఉదయం 6 గంటల నుండి తేదీ: 24-11-2025 ఉదయం 6 గంటల వరకు ఆమలులో వుంటుంది సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ 7(1) 2016, యాక్ట్, సెక్షన్ 55 db (A), 45db (A), 65db (A), 30 పోలీస్ యాక్ట్ 1861, రూల్ నెంబర్ 8 నోస్ పొల్యూషన్, (రెగ్యులేషన్ & కంట్రోల్) రూల్స్ 2000 ప్రకారం పోలీస్ కమిషనర్ గారు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. చిన్నపిల్లలు, వృద్ధులు, రోగులు, విద్యార్థుల విద్యాభ్యాసానికి భంగం కలగకుండా శబ్ద కాలుష్యం నుండి కాపాడేందుకు భారీ సౌండ్లతో కూడిన డిజె సౌండ్ వినియోగంపై నిషేధాజ్ఞలు విధించడం జరిగింది. మైక్ సెట్ వినియోగం తప్పనిసరి అనిపిస్తే సంబంధిత డివిజన్ ఏసిపి అధికారుల అనుమతి పొందాలని సూచించారు. పై నిబంధనలు ఉల్లంఘించి డీజే వినియోగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పై నిబంధనలు ఉల్లంఘించిన వారిపై సెక్షన్ 223 BNS, సెక్షన్ 70(A), 70(B) 70 C, 76, సిటీ పోలీస్ యాక్ట్ 1348 ఫాస్లి సెక్షన్ 76, సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం కేసులు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *