సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ వేగి రామారావు అనకాపల్లి, నవంబర్ 7: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా సేవా సంస్థల ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా జరగనున్న అఖండ సాయినామ సంకీర్తన భజన కార్యక్రమం శనివారంనాడు కే కోటపాడు శ్రీ రామాలయంలో వైభవంగా ప్రారంభం అవుతుందని శ్రీ సత్య సాయి సేవ సమితి కన్వీనర్ బండారు నారాయణ పాత్రులు విలేకరులకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి జరిగే ఈ అఖండ నామసంకీర్తన కార్యక్రమం శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై ఆదివారం సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది అని అన్నారు. సాయినామ గానంతో ప్రపంచం మొత్తం ఆధ్యాత్మికతతో నిండిపోతుందని అని తెలిపారు. కె .కోటపాడు మండలంలోని పలు గ్రామాల నుండి సాయి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భజనల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారని ఆయన తెలిపారు. కార్యక్రమానికి భక్తులందరూ హాజరై సాయినామాన్ని జపిస్తూ ఆధ్యాత్మికానందాన్ని పొందాలని బండారు నారాయణ పుత్రుడు కోరారు.