వందే మాతర గీతం 150 సంవత్సరాలు

సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 7 భూమయ్య రిపోర్టర్ మండలం పిట్లం మండల కేంద్రంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ పిట్లం పాఠశాలలో సామూహిక వందేమాతర గీతం ను ఆలాపన చేయడం జరిగింది. ఈ ఆలాపన కార్యక్రమం లో విద్యార్థులు,, విధ్వత్ సమితి కన్వీనర్ ఉడుగుల రాము వివరిస్తూ వందే మాతరం గేయం బ్రిటీష్ వాళ్ళ నుండి స్వతంత్రం సాధించు కోవడానికి, భరతీయులనందరిని ఐక్యంగా ఉంచడం కోసం ఎంత గానో దోహద పడింది అని తెలిపారు 1905 లో యావత్ భారత యువత వందే మాతర ఉద్యమం లో పాల్గొని బ్రిటీష్ వారితో పోరాడటం జరిగింది ఇదే ఉత్సాహం మనమందరం ఇక ముందు కూడా వందే మాతరం ని స్పూర్తి గా తీసుకొని ఐక్యంగా ఉండి ప్రపంచం లో నే భారత్ ను అగ్రగామి దేశం గా విశ్వ గురు స్థానం పొందడం కొరకు మనమందరం సమిష్టి గా ఉండాలని అన్నారు.ఈ కార్యక్రమం లో పాఠశాల ఉపాధ్యక్షులు ఔసుల సంతోష్, పూర్వ విద్యార్థులు జంగం ధర్మవీర్, కృష్ణ ప్రసాద్ మరియు పోషకులు శ్రీకాంత్ రెడ్డి, ప్రధానాచార్యులు గీత గారు, ఆచార్యులు, మాతాజీ లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *