సాక్షిడిజిటల్ న్యూస్, నవంబర్ 08,రాయికల్,వై.కిరణ్ బాబు:- వందేమాతరం గీతానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని ప్రగతి విద్యాసంస్థలో సామూహిక వందేమాతర గీతాలాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. విద్యార్థినులు భరతమాత వేషధారణలో హాజరై, చేతుల్లో త్రివర్ణ పతాకాలను ఊపుతూ దేశభక్తి స్ఫూర్తిని ప్రతిబింబించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ బాలె శేఖర్ మాట్లాడుతూ “వందేమాతరం మన జాతీయ గౌరవానికి ప్రతీక. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో దేశభక్తి, సమైక్యతా భావాలను పెంపొందిస్తాయి” అని అన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.