సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 7, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రతినిధి జి శ్రీనివాసరావు: అమలాపురం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఐ.పి.ఎస్ ఆదేశాల మేరకు శుక్రవారం రోజున ప్రత్యేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో అదనపు ఎస్పీ ఏ.వి.ఆర్.పి.బి. ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాతీయ భావాన్ని ప్రతిబింబిస్తూ కార్యాలయం ఆవరణలో ఉన్న భారతమాత చిత్రపటానికి అదనపు ఎస్పీ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం, అదనపు ఎస్పీ ఏ.వి.ఆర్.పి.బి. ప్రసాద్ , పోలీస్ కార్యాలయంలోని అధికారులు, సిబ్బందితో కలిసి సామూహికంగా వందేమాతర గేయాన్ని భక్తిశ్రద్ధలతో ఆలపించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ, స్వాతంత్ర్య పోరాటంలో అశేష ప్రజానీకానికి వందేమాతరం గేయం గొప్ప స్ఫూర్తిని, ప్రేరణను ఇచ్చిందని, దీనిని రచించిన బంకిం చంద్ర చటర్జీని స్మరించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. ఈ గేయం దేశభక్తిని, జాతీయ ఐక్యతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఏ ఆర్ డి ఎస్ పి శ్రీ సుబ్బరాజు , ఎస్ బి సీఐ పుల్లారావు , డి సి ఆర్ బి సీఐ మురళి కృష్ణ , ఏ ఆర్ ఆర్ ఐ లు బ్రహ్మానందo కోటేశ్వరరావు మరియు కార్యాలయ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.