సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 07 యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం రిపోర్టర్ ముషం శ్రీనివాస్ : మోత్కూర్ మండలం సదర్శాపురం నుండి కొమ్మూరి బావి వరకు రోడ్డు నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి డిమాండ్ చేశారు.శుక్రవారం రోజున సదర్ షాపురం నుండి కొమ్మూరి బావి వరకు వెంటనే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అనంతరం బొల్లు యాదగిరి మాట్లాడుతూ..తెలంగాణ ప్రభుత్వ పంచాయితీ ఇంజనిరింగ్ విభాగం ద్వారా సదర్ శాపురం నుండి కొమ్మూరి బావి వరకు గ్రావెల్ రోడ్డు నిర్మాణం కోసం CDP రూ, నాలుగు లక్షల అంచనా నిధులతో తేదీ 10/3/2024 రోజున స్థానిక ఎమ్మెల్యే మందుల సామెల్ శిలాఫలకం వేసి దాదాపు 18 నెలలు గడుస్తున్నా,వేసిన శిలాఫలకం శిదిలావస్థకు చేరినా, ఇప్పటికి ఏలాంటి పనులు ప్రారంభించ కుండా వదలి వేశారని విమర్శించ్చారు. ఈ రోడ్డు నిర్మాణం వల్ల అ ప్రాంత రైతులకు ప్రజలకు ఎంతో ఉపయోగ కరంగా ఉంటుందని వెంటనే రోడ్డు పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చెప్పడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు, మండల కమిటీ సభ్యులు కురిమేటి యాదయ్య, మెతుకు అంజయ్య, దొండ లింగయ్య, మెతుకు సాయిలు తదితరులు పాల్గొన్నారు.